మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (10:19 IST)

నల్గొండ జిల్లాలో నోట్ల కట్టలు - రూ.20లక్షల విలువైన 500 నోట్ల కట్టలు (video)

Fake currency
Fake currency
నల్గొండ జిల్లాలో నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన ఓ రైతుకు రూ.20లక్షల విలువైన 500 నోట్ల కట్టలు కనిపించాయి. అయితే నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి వుంది. 
 
ఇది దొంగ నోట్లు ముద్రించే వారి పనే అయి ఉంటుందని భావించి పోలీసులు ఫిర్యాదు చేశారు. నకిలీ నోట్లు ముద్రించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. 
 
అవన్నీ నకిలీ నోట్లేనని, ఈ నోట్లు అక్కడికి ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వాటిని ఎందుకు వినియోగిస్తున్నారనేది విచారణలో తేలుతుందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.