సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (14:42 IST)

కిలో రూ.80కి పెరిగిన టమోటా ధరలు.. రైతు బజారులో ఎంత?

tomatos
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంగళవారం నుంచి రైతు బజార్ల ద్వారా కిలో రూ.50కి టమాటను విక్రయించనుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు రాయలసీమ జిల్లాల నుంచి లేదా టమాటా తక్కువ ధరకు లభించే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా విక్రయిస్తారు. 
 
టమాటా కిలో రూ.50 కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుంది. మార్కెట్‌లో టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు సచివాలయంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. 
 
ప్రస్తుతం టమాటా మార్కెట్‌లో కిలో రూ.80కి విక్రయిస్తున్నారు. చిల్లర వ్యాపారులు కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. టమాటా ధరలు పెరిగినా మార్కెట్‌లో నాణ్యమైన టమాట దొరకడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది.