బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 7 అక్టోబరు 2024 (23:27 IST)

విశాఖపట్నంలో తమ మొదటి మోటోప్లెక్స్ డీలర్‌షిప్‌ను ప్రారంభించిన పియాజియో వెహికల్స్

Piaggio Vehicles
సుప్రసిద్ధ వెస్పా, స్పోర్టీ అప్రిలియా శ్రేణి స్కూటర్లు, మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ ఆటో దిగ్గజం, పియాజియో గ్రూప్‌కు 100% అనుబంధ సంస్థ అయిన పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ మొదటి మోటోప్లెక్స్‌ డీలర్‌షిప్‌ను ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వద్ద ప్రారంభించినట్లుగా వెల్లడించింది. కొత్తగా ప్రారంభించిన మోటోప్లెక్స్-యల్లోప్ మోటో పూర్తి శ్రేణి వెస్పా, ఏప్రిలియా, మోటో గుజ్జీతో పాటు ప్రత్యేకమైన అధికారిక మర్చండైజ్ మరియు సిబియుల క్రింద పూర్తి శ్రేణి ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది మరియు విక్రయాలను జరుపుతుంది. పియాజియో ఇండియా వద్ద  2-వీలర్ డొమెస్టిక్ బిజినెస్ ఈవీపీ, ముఖ్య అతిథి శ్రీ అజయ్ రఘువంశీ మరియు యల్లాప్ మోటో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యల్లపు నరేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
 
విశాలమైన ఈ  డీలర్‌షిప్ 2,646 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికమైన షోరూమ్‌ను కలిగి ఉంది. సంబంధిత బ్రాండ్‌ల యొక్క గొప్ప ఇటాలియన్ వారసత్వాన్ని ప్రతిబింబించే రీతిలో ప్రీమియం కస్టమర్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన 2,410 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక సేవా వర్క్‌షాప్ కూడా వుంది. 
 
పియాజియో ఇండియా వద్ద 2-వీలర్ డొమెస్టిక్ బిజినెస్ ఈవీపి శ్రీ అజయ్ రఘువంశీ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, - “యల్లోప్ మోటో (Yallop Moto)ద్వారా, వెస్పా, ఏప్రిలియా, మోటో గుజ్జీతో ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడం ద్వారా విశాఖపట్నంలోని కస్టమర్‌లతో మా అనుబంధాన్ని బలోపేతం చేసుకోనుండటం పట్ల మేము సంతోషిస్తున్నాము. విశాఖపట్నం నుండి ఎల్లప్పుడూ మాకు అధిక స్పందన లభిస్తోంటుంది మరియు మా కస్టమర్‌లకు మరింతగా అందుబాటులోకి వచ్చేలా నగరంలో మా మొదటి మోటార్‌ప్లెక్స్‌ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. పియాజియో ఇండియా వద్ద , మేము అధిక-నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడానికి మరియు మా ఖాతాదారులకు ఉత్తమ యాజమాన్య అనుభవాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తుంటాము. యల్లోప్ మోటోతో, కొత్త కస్టమర్‌లను స్వాగతించడానికి మరియు వారికి అద్భుతమైన అనుభవాన్ని అందించడానికి మేమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము" అని అన్నారు.
 
తన అభిప్రాయాలను పంచుకుంటూ, యల్లోప్ మోటో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎల్లపు నరేంద్ర మాట్లాడుతూ, "పియాజియో ఇండియా యొక్క అత్యంత ప్రీమియర్ డీలర్‌షిప్ ఆఫర్ - మోటో ప్లెక్స్  కోసం చేతులు కలపడం పట్ల నేను సంతోషిస్తున్నాను. ఈ రోజు అందుబాటులో ఉన్న అత్యుత్తమ బ్రాండ్‌ల నుండి తమ సవారీ  కలలను సాకారం చేసుకోవాలని చూస్తున్న ప్రతి కస్టమర్‌ కోసం 125cc నుండి 1000cc వరకు పూర్తి స్థాయి మోడల్‌లను ప్రదర్శించడానికి మరియు రిటైల్ చేయడానికి మేము ఆసక్తిగా ఉన్నాము. వెస్పా, ఏప్రిలియా మరియు మోటో గుజ్జీలు పియాజియో గ్రూప్‌కు చెందిన మార్క్యూ బ్రాండ్‌లు, వీటిని విశాఖపట్నంలోని వినియోగదారులకు చేరువ చేయడం మాకు గర్వకారణం." అని అన్నారు.