శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జనవరి 2025 (17:07 IST)

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Konda Pochamma Sagar Reservoir
Konda Pochamma Sagar Reservoir
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మార్కూరు మండల సమీపంలోని కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో ఐదుగురు యువకులు మునిగిపోయారు. సెల్ఫీల కోసం ప్రయత్నించి వీరు ప్రాణాలు కోల్పోయారు.
 
మృతులను ధనుష్ (20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17)లుగా గుర్తించారు. వారిలో ధనుష్, లోహిత్ సోదరులు. మృతదేహాలను వెలికితీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 
 
హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకుల బృందం శనివారం జలాశయాన్ని సందర్శించింది. ఈత కొట్టడానికి ప్రయత్నిస్తుండగా, వారిలో ఐదుగురు ప్రమాదవశాత్తు మునిగిపోగా, మిగిలిన ఇద్దరు సురక్షితంగా తప్పించుకున్నారు. సమాచారం అందిన వెంటనే, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.