గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రాథమిక సమాచారం మేరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకోవడంతో వారంతా చనిపోయినట్టు సమాచారం. మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపకదళ సిబ్బంది యత్నిస్తున్నారు. గాయపడిన వారిని ఉస్మానియా, యశోద, డీఆర్డీవో, అపోలో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.