గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (12:56 IST)

తెలంగాణకు గుడ్ న్యూస్: 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు

Rains
తెలంగాణకు గుడ్ న్యూస్. రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. తెలంగాణలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. 
 
నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో శనివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
 
అలాగే మరికొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు వచ్చే ఐదు రోజులపాటు ఉండే వాతావరణ పరిస్థితులపై శుక్రవారం బులెటిన్ విడుదల చేసింది. ఈ మేరకు వచ్చే ఐదు రోజులపాటు ఉండే వాతావరణ పరిస్థితులపై శుక్రవారం బులెటిన్ విడుదల చేసింది.