వీళ్ళు భలే దొంగలురా బాబూ... చోరీకొచ్చి ఏం తీసుకెళ్లారో తెలుసా? (Video)
హైదరాబాద్ నగరంలో కొందరు దొంగలు చేసిన పని ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్పిస్తోంది. దొంగతనానికి వచ్చిన ఈ దొంగలు వారు ఎత్తుకెళ్లింది ఏంటో తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా నగరంలోని మూసారాబాగ్ పరిధిలోని ఈస్ట్ ప్రశాంత్ నగర్‌లో ఈ వింత చోరీ ఘటన జరిగింది. పలువురు దొంగలు అపార్టుమెంట్స్‌లో చొరబడి చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్లారు.
ఏకకాలంలో ఇలా నాలుగు అపార్టుమెంట్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఉదయం బయటకు వచ్చి చూసిన అపార్టుమెంట్ వాసులకు తమ చెప్పులు, బూట్లు కనిపించకపోవడంతో ఖంగుతిన్నారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించి షాకయ్యారు.
ఇక్కడ కొస మెరుపు ఏంటంటే... బాధితుల్లో మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్, ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉండటం విశేషం. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో బయటకురావడంతో ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.