1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Road Accident at Nalgonda : 8 year old boy with fourd died

హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

road accident
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయరహదారిపై హైదరాబాద్‌ వెళ్తున్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 ఏళ్ల బాలుడు సహా నలుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
రాజధాని హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంపై చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కన్నతండ్రే కాల యముడయ్యాడు.... కన్నకొడుకును కొట్టి చంపేసిన తండ్రి.. ఎక్కడ?