గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (11:42 IST)

కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. అక్భరుద్ధీన్ ఓవైసీ

Akbaruddin Owaisi
బండ్లగూడలో గల ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై స్పందించారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ క్రమంలో అంటూ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
"కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. ఆ స్కూల్ కూల్చకండి. పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించా. వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారు..." ఓవైసీ మండిపడ్డారు. 
 
తనపై దాడులు చేయండి కానీ.. పేదల విద్యాభివృద్ధికి అడ్డుపడకండి అంటూ ఓవైసీ వ్యాఖ్యానించారు. దయచేసి ఆ స్కూల్ కూల్చొద్దు అని కోరారు. 
 
పేద విద్యార్థుల ఆ పాఠశాల వరం లాంటిదని కోరారు. కొందరు కావాలనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ వైరంతో తాము నిర్మించిన స్కూల్ కూల్చాలని కోరడం సరికాదన్నారు.