సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (16:44 IST)

కోదండరామ్ - అలీఖాన్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయొద్దు : హైకోర్టు

kodandaram
తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరామ్‌కు తెలంగాణ హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయొద్దంటూ ఆదేశించింది. వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని తెలిపింది. తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ప్రతిపాదించగా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ఫైలుపై సంతకం చేశారు. దీంతో వీరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయాల్సివుంది. అయితే, వీరి నియామకాలను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ఎమ్మెల్సీ అంశం తేలే వరకు వారి ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. 
 
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ - సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా, నిబంధనల ప్రకారం లేదని గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో కోదండరామ్, అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే, తమ ఎమ్మెల్సీ అంశంపై దాఖలైన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఆ ఆంశం తేలేవరకు కొత్తగా ఎంపికైన వారు ప్రమాణ స్వీకారం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.