చాక్లెట్ ఇస్తామంటూ చెప్పి చిన్నారిపై అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?
కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరుసలు లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి చిన్నారిపై మద్యం మత్తులో ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి, ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఎనిమిదేళ్ల బాలిక ఆడుకుంటూ వుండగా.. చాక్లెట్ కొనిస్తామని ఇద్దరు యువకులు ఆ బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే కామాంధుల అకృత్యానికి అనంతరం తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. వెంటనే స్థానికులు ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు.
సీసీటీవీ కెమెరాల ఆధారంగా స్థానికులు కామాంధులను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. యువకులు మద్యం మత్తులో ఉన్నారని విచారణలో తేలింది. అయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.