1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 మే 2025 (12:32 IST)

వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి జ్యోతిర్మయి

baby boy
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలంటేనే ప్రస్తుతం మహిళలు జడుసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులే ప్రసవాలకు సేఫ్ అనుకుంటున్నారు చాలామంది. అయితే వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె. జ్యోతిర్మయి సోమవారం వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తన రెండవ బిడ్డకు జన్మనిచ్చారు. జ్యోతిర్మయి ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఆగస్టు 16, 2023న ఆమె అదే ఆసుపత్రిలో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. 
 
జ్యోతిర్మయికి రెండూ సాధారణ ప్రసవాలే. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడానికి, ఆమె వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరారని ఆమె అన్నారు. జ్యోతిర్మయి తన ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకున్నందుకు ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసించారు.