శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (18:39 IST)

తల్లిదండ్రుల నిర్లక్ష్యం.. బాలుడు అలా తప్పించుకున్నాడు..

ఓ బాలుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో రోడ్డు మీదకి పరిగెత్తుకొచ్చిన బాలుడిని వేగంగా వచ్చిన మోటర్ సైకిల్ ఢీ కొట్టింది. అంతే కాక బాలుడు మీద నుంచి మోటార్ సైకిల్ వెళ్ళిపోయింది. ఈ ఘటనలో స్వల్పగాయాలతో బాలుడు బయట పడ్డాడు. రోడ్డుకు ఇరు వైపులా తల్లిదండ్రులు నిలబడి బాలుడిని పిలవడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం పై బాలానగర్ పోలీసుల విచారణ చేపట్టారు.
 
నిజానికి నిన్న బాలానగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. బాలనగర్రాజు కాలనీకి చెందిన గాలయ్య రోడ్డు దాటుతుండగా.. సికింద్రాబాద్ నుంచి జీడిమెట్లవైపు వెళ్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో గాలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ బాలుడి విషయంలో మాత్రం తల్లితండ్రులదే తప్పని స్థానికులు అంటున్నారు.