ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థిని శీలాన్ని కాటేసిన కామాంధుడు...

woman victim
ఠాగూర్|
హైదరాబాద్ నగరంలోని రహమత్ నగర్‌లో ఓ డిగ్రీ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. పెళ్లి పేరుతో నమ్మించిన ఇంటికి పిలిచిన బీటెక్ విద్యార్థి.. అత్యాచారానికి పాల్పడ్డాడు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రహమత్‌నగర్‌ సమీపంలోని కార్మికనగర్‌లో నివసించే విద్యార్థిని (23) బీకాం చదువుతోంది. అదేప్రాంతానికి చెందిన బీటెక్‌ విద్యార్థి రాజు(23) ఆమెతో మాట్లాడాలని శుక్రవారం ఇంటికి పిలిచాడు.

పెళ్లి విషయమై మాట్లాడుకుందామని చెప్పడంతో ఆ యువతి అతని మాటలు నమ్మి ఇంటికి వచ్చింది. ఇదే అదునుగా భావించిన బిటెక్ విద్యార్థి.. ఆమెను ఇంట్లో బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న యువతి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :