నయీమ్ నన్ను సీఎంగా చూడాలనుకున్నాడు... నాకు అతడు బాగా తెలుసు... ఐతే ఏంటి? ఆర్.కృష్ణయ్య

తెలంగాణ గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమైనప్పటికీ అతడి డైరీ మాత్రం పలువురు నాయకులను బయటకు లాగుతూనే ఉంది. ఇకపోతే తాజాగా నయీమ్ తో స్నేహసంబంధాలను కొనసాగించినట్లు తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆయన ఓ టెలివిజన్ ఛాన

ivr| Last Modified శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (20:47 IST)
తెలంగాణ గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమైనప్పటికీ అతడి డైరీ మాత్రం పలువురు నాయకులను బయటకు లాగుతూనే ఉంది. ఇకపోతే తాజాగా నయీమ్ తో స్నేహసంబంధాలను కొనసాగించినట్లు తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆయన ఓ టెలివిజన్ ఛానల్ తో ఈ విషయమై మాట్లాడారు. నయీమ్ తను కలిసి రాడికల్ ఉద్యమ సమయంలో పని చేశామని తెలిపారు.

తనను తెలంగాణకు సీఎంగా చూడాలన్నది నయీమ్ కల అని సంచలన వ్యాఖ్యలు చేశారు కృష్ణయ్య. 1986 నుంచి తనకు నయీమ్ తెలుసని చెప్పారు. ఐతే నయీత్ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. అతడితో కేవలం స్నేహంగా మాట్లాడేవాడినని తెలిపారు. అంతకుమించి ఏమైనా ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా తను సిద్ధమేనని తెలిపారు.

నయీంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధాలున్నాయనీ, సీబీఐతో దర్యాప్తు చేయిస్తే అన్నీ బయటకు వస్తాయని తెలిపారు. నయీమ్ డైరీ ఎక్కడ ఉందో మీడియా ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు కాకుండా అయితే తనలాంటి బడుగు నేతలనే టార్గెట్ చేస్తారనీ, సీబీఐ దర్యాప్తు చేస్తే పెద్ద తలకాయలు బయటకు వస్తాయని తెలిపారు.దీనిపై మరింత చదవండి :