సహజీవనం చేసి వదిలివేసిన మహిళపై ప్రతీకారం తీర్చుకున్న ఫార్మా కంపెనీ మేనేజర్!
తనతో సహజీవనం చేసిన తోటి ఉద్యోగి తనను పట్టించుకోవడంలేదని ఓ ఫార్మా కంపెనీ మేనేజర్ ఆమెపై పగ పెంచుకున్నాడు. గతంలో వారిద్దరు ఏకాంతంగా గడిపినప్పుడు తీసిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి వేధిస్తున్నాడు. దీంతో బా
తనతో సహజీవనం చేసిన తోటి ఉద్యోగి తనను పట్టించుకోవడంలేదని ఓ ఫార్మా కంపెనీ మేనేజర్ ఆమెపై పగ పెంచుకున్నాడు. గతంలో వారిద్దరు ఏకాంతంగా గడిపినప్పుడు తీసిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కర్ణాటకకు చెందిన మహేశ్, హైదరాబాద్‌కు చెందిన యువతి, బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొన్ని రోజులు కలిసి పని చేశారు.
ఆసమయంలో వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సహజీవనానికి దారితీసింది. అయితే సదరు యువతి హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ కావడంతో వారి మధ్య దూరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతడు యువతిని తనతో కలిసి ఉండాలని, లేకపోతే సహజీవనంలో ఉన్నప్పుడు కలిసి దిగిన ఫొటోలను బయటపెడతానని మహేశ్ బెదిరింపులు మొదలుపెట్టాడు.
ఆమె అందుకు నిరాకరించడంతో ఆ ఫొటోలను అమ్మాయి ఫేస్‌బుక్ ఖాతాలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మహేశ్‌ను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు.