మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (14:49 IST)

వాట్సాప్ స్టేటస్.. అంత పని చేసింది..

ఓ మహిళ పెట్టిన వాట్సాప్ స్టేటస్ 15 నెలల నాటి బంగారం చోరీ కేసును చేధించేందుకు ఉపయోగపడింది. వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాయిపురి కాలనీలో నివసించే రవి కిరణ్‌ ఇంట్లో గత ఏడాది దొంగతనం జరిగింది. వారి కుటుంబం గుడికి వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ జరిగింది. దీంతో రవి కిరణ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక ఇటీవల అతడి పొరుగింటి మహిళ వాట్సాప్‌లో ఓ స్టేటస్‌ పెట్టింది. 
 
అందులో ఆమె ఓ బంగారు ఆభరణాన్ని ధరించి ఉండగా.. అది తమదేనని రవి కిరణ్‌ గుర్తించారు. ఈ విషయాన్ని అతడు పోలీసులకు వివరించారు. ఈ క్రమంలో రవి కిరణ్‌ పొరుగింటి వారిని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
రవి కిరణ్‌ ఇంటి పక్కన నివసించే పొన్నుగోటి జితేందర్‌ ఈ దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ విషయం అతడి తల్లికి ముందే తెలియడంతో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.