కేసీఆర్ ఆదేశం... గొఱ్ఱె పిల్లల కోసం తెలంగాణ మంత్రులు పరుగులు....
తెలంగాణ ముఖ్యమంత్రి అనుకున్నారంటే అది అయ్యేదాకా నిద్రపోరనే పేరుంది. తాజాగా ఆయన తెలంగాణ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఓ కీలక నిర్ణయంపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. అదేమిటంటే... తెలంగాణలో గొఱ్ఱెలను పెంచుకునే ప్రతి గొల్ల, కుర్మ కుటుంబాలకు కనీస
తెలంగాణ ముఖ్యమంత్రి అనుకున్నారంటే అది అయ్యేదాకా నిద్రపోరనే పేరుంది. తాజాగా ఆయన తెలంగాణ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఓ కీలక నిర్ణయంపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. అదేమిటంటే... తెలంగాణలో గొఱ్ఱెలను పెంచుకునే ప్రతి గొల్ల, కుర్మ కుటుంబాలకు కనీసం 20కి తగ్గకుండా గొఱ్ఱె పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఈ గొఱ్ఱె పిల్లలతో పాటు ఓ పొట్టేలను కూడా ఇవ్వాలని సంకల్పించారు. కాబట్టి తెలంగాణలో వున్న ఆ వర్గం కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి సుమారు లక్షన్నర విలువ చేసే గొఱ్ఱెలను ఇవ్వాలని ఆయన ఆదేశించినట్లు తెలిస్తోంది. తొలకరి జల్లులు పడగానే పిల్లలు సిద్ధంగా వుంచాలనీ, వాటిని లబ్దిదారులకు పంపిణీ చేయాలని సూచించారు.
దీనితో ఇప్పుడు తెలంగాణ మంత్రులు గొఱ్ఱె పిల్లల కోసం పరుగులు పెడుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తమ్మీద వచ్చే 2019 ఎన్నికల నాటికి కేసీఆర్ కు తప్పితే మరింకెవరికీ తెలంగాణ ప్రజలు ఓట్లు వేయలేని పరిస్థితిని తీసుకువస్తున్నట్లు లేదూ...?!! దటీజ్ కేసీఆర్.