గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: గురువారం, 6 ఏప్రియల్ 2017 (13:38 IST)

ఈ దేశంలో అలా చెప్పిన దమ్మున్న మగాడు ఒక్క కేసీఆర్... కేటీఆర్ మాట

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై తెరాస మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆర్మూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, 70 ఏళ్లలో సుమారు 50 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ 50 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐతే గత

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై తెరాస మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆర్మూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, 70 ఏళ్లలో సుమారు 50 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ 50 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐతే గత ఎన్నికల్లో కేసీఆర్, తను చెప్పిన హామీలను నెరవేర్చకపోతే మీ వద్దకు ఓట్లు అడిగేందుకు రానని చెప్పారు. 
 
సాధారణ ఓ పంచాయతీ సభ్యుడు సైతం ఎన్నికల్లో గెలిచేటపుడు అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి ఆ తర్వాత తప్పించుకు తిరుగుతారు. ప్రజలకు ముఖం చూపించకుండా తప్పించుకు తిరుగుతారు. అలాంటిది కేసీఆర్ ఎంతో ధైర్యంతో తను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్లీ మీ ముందుకు రానని చెప్పిండ్రు. అలాంటి దమ్మున్న నాయకుడు దేశంలో ఒకే ఒక్క కేసీఆర్ అని అన్నారు. 
 
ముఖ్యమంత్రిగా ఆయన పదవీబాధ్యతలు చేప్పిన దగ్గర్నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ, హరితహారం, కులవృత్తులకు పెద్దపీట... ఇలా ఎన్నో కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టి ముందుకు వెళుతున్నారు. 23 శాతం వున్న అటవీ సంపదను తెలంగాణలో ఇప్పుడు 33 శాతానికి పెంచారు. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించివారు ఏం చేశారు? అని ప్రశ్నించారు.