బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (19:29 IST)

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు లేవు.. హ్యాట్రిక్ ఖాయం.. కేటీఆర్

ktramarao
టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు లేవ‌ని ఆయ‌న‌ ప్ర‌క‌టించారు. 
 
షెడ్యూల్ ప్ర‌కార‌మే 2023లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌న్న కేటీఆర్, ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్యక్తం చేశారు.  
 
హైద‌రాబాద్‌లో మీడియా ప్ర‌తినిధుల‌తో శుక్ర‌వారం చిట్‌చాట్ నిర్వ‌హించిన సంద‌ర్భంగా తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లపై కేటీఆర్ స్పందించారు. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని చెప్పిన కేటీఆర్‌... ఎన్నిక‌ల్లో 90కి పైగా స్థానాల‌ను టీఆర్ఎస్ గెలుస్తుంద‌ని జోస్యం చెప్పారు. 
 
సీఎం కేసీఆర్‌ను దొర అంటూ విప‌క్షాలు ఆరోపిస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కేటీఆర్‌... దొర అయితే కేసీఆర్ ఎంత‌మందిని జైల్లో పెట్టార‌ని ప్ర‌శ్నించారు.