3 నెలల పసికందుపై అత్యాచారం.. కామాంధుడికి జీవితఖైదు.. రూ.4వేల జరిమానా
ముక్కుపచ్చలారని పసిపాపపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. ఇంకా నిందితుడికి రూ.4వేల జరిమానా విధించారు. పసికందుపై అత్యాచార నేరానికి ఏడేళ్ళ
ముక్కుపచ్చలారని పసిపాపపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. ఇంకా నిందితుడికి రూ.4వేల జరిమానా విధించారు. పసికందుపై అత్యాచార నేరానికి ఏడేళ్ళ జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా, పోక్సో చట్టం ప్రకారంగా జీవిత ఖైదు, రూ2 వేల ప్రకారం జరిమానాను విధిస్తూ రెండు శిక్షలను ఏకకాలంలో అమల్లో ఉంటాయని కోర్టు తీర్పు చెప్పింది. జరిమానాను చెల్లించకపోతే మరో 9 మాసాలపాటు కఠిన కారాగార శిక్షను అనుభవించాలని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల కేంద్రంలోని పోచమ్మ బస్తీకి చెందిన పెడి కృష్ణ ప్రైవేట్ ఎలక్ట్రీషీయన్‌గా పనిచేసేవాడు. అయితే తన ఇంటికి సమీపంలో 2015 నవంబర్ 20వ తేదిన తల్లి పక్కనే నిద్రిస్తున్న మూడు నెలల పసికందును కిడ్నాప్ చేశాడు. ఆ బిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆధారాలతో నిరూపించడంతో జీవితఖైదు తప్పలేదు.
నిందితుడు మూడు మాసాల పసిపాపపై అత్యాచారం చేసినట్టుగా కోర్టు నిర్దారించింది. అయితే తనకు శిక్ష విషయంలో నిందితుడు క్షమించాలని కోర్టును కోరారు. ఈ రకమైన నేరాలకు పాల్పడిన నిందితులకు చట్టప్రకారంగా శిక్ష పడాల్సిందేనని జడ్జి అభిప్రాయపడ్డారు.