శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 27 మే 2019 (16:47 IST)

భువనగిరిలో 'కారు'ను 'రోలర్' తొక్కేసింది : హరీశ్ రావు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లకు కూడా ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నెల23వ తేదీన వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస 9 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు, ఎంఐఎం ఒకటి చొప్పున సీట్లు కైవసం చేసుకున్నారు. అయితే, తెరాస కంచుకోటల్లో ఒక్కటైన కరీంనగర్, భువనగిరి, నిజామాబాద్, అదిలాబాద్ స్థానాల్లో తెరాస చిత్తుగా ఓడిపోయింది. 
 
ముఖ్యంగా నిజామాబాద్‌లో తెరాస రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె.కవిత కూడా ఓడిపోయారు. అలాగే భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. ఆయన తెరాస అభ్యర్థి బోరా నర్సయ్య గౌడ్ ఓడిపోయారు. 
 
అయితే, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి ఏకంగా 27 వేల ఓట్లు వచ్చాయి. ఈయన రోలర్ గుర్తుపై పోటీ చేశారు. దీనిపై తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు స్పందించారు. భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో కారును రోలర్ తొక్కేసిందని అందువల్ల ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఈ ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.