1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (15:01 IST)

అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు.. నో బాంబ్!

కోలీవుడ్ అందాల హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో హీరోగా మంచి గుర్తింపు ఉన్న అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. 
 
ఈ ఉదయం తెల్లవారుజామును ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి... అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు సమాచారమిచ్చాడు. దీంతో, బాంబ్ స్క్వాడ్ హుటాహుటిన అజిత్ ఇంటికి చేరుకుని... అణువణువూ గాలించింది. చివరకు ఎలాంటి బాంబు లేదని తేల్చింది. 
 
ఈ సమయంలో 'తాళ 55' సినిమా షూటింగులో అజిత్ ఉన్నారు. అయితే, ఈ బెదిరింపు కాల్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అన్న విషయాలపై పోలీసులు దృష్టి సారించారు.