ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Hanumantha Reddy

ప్రేమ వివాహం అంటేనే ఇష్టం..!: సమంత

"ఏ మాయ చేశావే" చిత్రం ద్వారా టాలీవుడ్ ఆరంగేట్రం చేసి యువత హృదయాలను మాయ చేసిన "సమంత" పెద్దలు కుదిర్చిన పెళ్లికంటే ప్రేమ వివాహాన్నే ఎక్కువగా ఇష్టపడుతుందట. తన పాఠశాల రోజుల్లో ఓ అబ్బాయిని కూడా ప్రేమించానని సమంత కాజువల్‌గా ఒప్పేసుకుంది.

అయితే ఆ ప్రేమ కాస్త కాలగమనంలో కలసిపోయిందని సమంతా చెబుతోంది. చిన్నతనం కదా ఏవో చిన్న చిన్న గొడవల కారణంగా ఆ ప్రేమ కాస్త విరిగిపోయిందని అమ్మడు మనసులోని మాటను బయటపెట్టింది.

ఇంకా సమంతా తన ప్రేమ గురించి చెబుతూ.. "నా కోసం ఎక్కడో అక్కడ ఒకతను పుట్టే ఉంటాడు, భవిష్యత్‌లో కచ్చితంగా అతనితో మరోసారి ప్రేమలో పడతాను. పెద్దలు కుదిర్చిన పెళ్లి కన్నా ప్రేమ వివాహాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను" అంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ. మరి ఇంతకి సమంత ప్రేమను దక్కించుకునే ఆ అదృష్టవంతుడు ఎవరో..? వేచి చూడాల్సిందే..!