గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 1 డిశెంబరు 2017 (14:30 IST)

అజ్ఞాతవాసి కథ లీక్... త్రివిక్రమ్ ఆగ్రహం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న అజ్ఞాత వాసి సినిమా కథ లీకయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా లీక్ వ్యవహారమే చర్చ జరుగుతోంది. సినిమా యూనిట్‌లోని కొంతమంది ఈ కథను లీక్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చాలా సీరియస్‌గా ఉన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న అజ్ఞాత వాసి సినిమా కథ లీకయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా లీక్ వ్యవహారమే చర్చ జరుగుతోంది. సినిమా యూనిట్‌లోని కొంతమంది ఈ కథను లీక్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చాలా సీరియస్‌గా ఉన్నారు. సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఎలా లీక్ చేస్తారని ఆగ్రహంతో ఊగిపోతున్నారట. 
 
ఇప్పటికే షూటింగ్ వారణాసిలో చురుగ్గా సాగుతోంది. అత్తారింటికి దారేది తరువాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో కథ లీక్ అవ్వడంతో అభిమానుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. కథను లీక్ చేసి సామాజిక మాధ్యమాల్లో పంపించిన సినిమా యూనిట్‌లోని కొంతమంది సభ్యులను త్రివిక్రమ్ తొలగించినట్లు తెలుస్తోంది.