గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 10 జులై 2017 (11:03 IST)

అమలా పాల్‌ చేపల పులుసు పెడితే.. టేస్ట్ అదిరిపోతుందట..?

చేపల వంటకాలను రుచికరంగా వండటంలో సినీ నటి అమలా పాల్ కిలేడీ అంటున్నారు.. సన్నిహితులు. విజయ్‌ను అవసర అవసరంగా ప్రేమించి.. పెళ్ళి చేసుకుని.. అదే స్పీడులో విడాకులు తీసుకున్న అమలా పాల్.. విడాకుల తర్వాత చేతిన

చేపల వంటకాలను రుచికరంగా వండటంలో సినీ నటి అమలా పాల్ కిలేడీ అంటున్నారు.. సన్నిహితులు. విజయ్‌ను అవసర అవసరంగా ప్రేమించి.. పెళ్ళి చేసుకుని.. అదే స్పీడులో విడాకులు తీసుకున్న అమలా పాల్.. విడాకుల తర్వాత చేతినిండా సినీ ఛాన్సులతో తెగ బిజీ బిజీగా ఉంటోంది. 
 
తాజాగా ధనుష్‌తో వీఐపీ-2లో నటించింది. అలాగే తిరుట్టు పయలె-2, భాస్కర్ ద రాస్కల్ (మలయాళ తమిళ రీమేక్), మలయాళంలో మరో రెండు సినిమాలకు కాల్షీట్లు ఇచ్చిన అమలా పాల్.. షూటింగులతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ.. వంట చేయడంలో అమలా పాల్ ఆసక్తి చూపుతుందట. 
 
నోరూరించే వంటకాలు తయారీ చేయడంలో అమలా పాల్ ముందుంటుందట. ఆమె చేతులారా.. చేపల పులుసు చేస్తే.. అదిరిపోతుంది. సమయం దొరికినప్పుడల్లా.. అమలా పాల్ రకరకాల చేపల వంటకాలను తయారు చేస్తుందట.