శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (10:59 IST)

అతనో గొరిల్లా... అలీ షోలో యాంకర్ శ్రీముఖి సరదా వ్యాఖ్య

బుల్లితెర యాంకర్లు శ్రీముఖి, రవిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీ షోలల్లో యాంకరింగ్ చేస్తూ, ఒకరిని ఒకరు కవ్వించుకుంటూ, అప్పుడప్పుడూ హద్దులు దాటుతుంటారు. వీరిద్దరూ కలిసి ఓ టీవీలో ఆలీతో జాలీగా

బుల్లితెర యాంకర్లు శ్రీముఖి, రవిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీ షోలల్లో యాంకరింగ్ చేస్తూ, ఒకరిని ఒకరు కవ్వించుకుంటూ, అప్పుడప్పుడూ హద్దులు దాటుతుంటారు. వీరిద్దరూ కలిసి ఓ టీవీలో ఆలీతో జాలీగా అనే టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి... రవిపై తన అభిప్రాయాన్ని చెబుతూ తమాషా చెప్పింది. ఒక్క మాటలో రవి గురించి ఏం చెబుతావని అడిగితే, "పిచ్చి" అనేసింది.
 
రవిని ఏ జంతువుతో పోలుస్తావని అడిగితే, "గొరిల్లా" అంది. ఎందుకని అడిగితే, మనిషి గొరిల్లా నుంచే వచ్చాడని గుర్తు చేస్తూ, రవి ఎన్నో కోతి వేషాలు వేస్తుంటాడని, రవి డ్యాన్స్ చేస్తున్నప్పుడు దూరం నుంచి చూస్తుంటే తనకు కోతే కనిపిస్తుందని శ్రీముఖి చెప్పుకొచ్చింది. దీంతో ఈ షోకు హాజరైన వారంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వారు.