మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: మంగళవారం, 17 మే 2016 (19:52 IST)

చిరంజీవికి లడ్డూ కావాలట... దొరికిందంటున్న యూనిట్...

లడ్డూ కావాలా! బాబూ అంటూ.. ఓ యాడ్‌ వస్తుంది. ఇప్పుడు ఫిలింనగర్‌లో చిరంజీవిపై ఆ యాడ్‌ సెటైర్‌గా పిలుచుకుంటున్నారు. విషయం ఏమంటే.. చిరంజీవి 150వ సినిమాలో కథానాయికగా ఎవరు? అనేది ఇంకా సస్పెన్స్‌గా వుంది. నాగార్జునకు అనుష్క లడ్డూ లాంటిదట. ఇప్పుడు చిరంజీవికి

లడ్డూ కావాలా! బాబూ అంటూ.. ఓ యాడ్‌ వస్తుంది. ఇప్పుడు ఫిలింనగర్‌లో చిరంజీవిపై ఆ యాడ్‌ సెటైర్‌గా పిలుచుకుంటున్నారు. విషయం ఏమంటే.. చిరంజీవి 150వ సినిమాలో కథానాయికగా ఎవరు? అనేది ఇంకా సస్పెన్స్‌గా వుంది. నాగార్జునకు అనుష్క లడ్డూ లాంటిదట. ఇప్పుడు చిరంజీవికి కూడా తన 150వ సినిమాలో అనుష్క వుంటే బాగుంటుందనే అనిపిస్తుందట. పేరుకు తగినట్లు 'కత్తిలాంటోడు' సినిమాకు అనుష్క తోడయితే బాగుంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది.
 
 
అయితే చిరు పక్కన 25 మందిని గాలింపు చేసి.. ఆఖరికి నయనతార, అనుష్క పేర్లను ఫైనల్‌ చేశారు. చిత్రమేమంటే.. నయతార మూడు భాషల్లో చిత్రాలు చేయడంతో బిజీగా వుండటంతో ఇక మిగిలింది అనుష్క. ఇటీవలే అనుష్కను దర్శకుడు వినాయక్‌ కలిసాడట. మంచి ఆఫర్‌ కూడా ఇవ్వడంతో.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలిసింది. చిరంజీవి రెండు పాత్రలు వేయడంతో.. మరో హీరోయిన్‌ను వెతుక్కోవాలి పాపం. అన్నట్లు.. ఈ సినిమా జూన్‌లో సెట్‌ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం.