గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?
గుండె పోటు. ఈ సమస్యతో ఇటీవలి కాలంలో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. గుండె పోటు వచ్చే ముందు 8 హెచ్చరిక సంకేతాలు ముందుగా కనబడతాయి అంటున్నారు వైద్యులు. అవేమిటో తెలుసుకుందాము.
8 గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం
గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం
ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం
లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం
కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం
గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
విశ్రాంతి లేనట్లుగానూ, చిన్నచిన్న విషయాలకే తీవ్ర అసహనం కలగడం
చేతులు కాళ్లు చల్లబడి పోతుండటం వంటివి గుండెపోటు వచ్చే ముందు చిహ్నాలుగా చెప్తారు.