మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (11:58 IST)

సోదరి పెళ్లిలో నాట్యం చేస్తూనే గుండెపోటుతో కుప్పకూలిన యువతి (video)

young woman died after collapsing due to a heart attack
గుండెపోటుతో యువతి మృతి
మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కనుక ఉన్నన్నాళ్లూ దుఃఖానికి దూరంగా ఆనందాలకు దగ్గరగా వుంటూ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ వుండాలి. ఎందుకంటే ఈమధ్య కాలంలో చూస్తూ చూస్తూనే గుండెపోటుతో కుప్పకూలి మరణిస్తున్నవారి సంఖ్య అధికమవుతోంది. అసలు విషయానికి వస్తే... పరిణీత జైన్ తన సోదరి పెళ్లిలో సంతోషంగా నృత్యం చేస్తుండగా, కొన్ని సెకన్లలోనే ఆమెకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆమె నృత్యం చేస్తుండగానే స్టేజి పైన కుప్పకూలిపోయి నిర్జీవంగా మారిపోయింది. పెళ్లి ఆనందం అంతా శోకసంద్రంగా మారింది. కనుక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వుండాలి.
 
గుండెపోటు లక్షణాలు ఏమిటి?
8 గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం
గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం
ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం
లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం
కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం
గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
విశ్రాంతి లేనట్లుగానూ, చిన్నచిన్న విషయాలకే తీవ్ర అసహనం కలగడం
చేతులు కాళ్లు చల్లబడి పోతుండటం వంటివి గుండెపోటు వచ్చే ముందు చిహ్నాలుగా చెప్తారు.