సంబంధిత వార్తలు
- అర్జున్ రెడ్డి కొత్త వివాదం: సీన్లోకి అనసూయ.. జబర్దస్త్ స్కిట్ కంటే తక్కువేనన్న ఫ్యాన్స్..
- నగ్న చిత్రాలకు ఒక్క అడుగు దూరం... అదే వర్మ 'చేతిలో కొబ్బరిచిప్ప'
- అర్జున్ రెడ్డి లిప్ లాక్ సీన్లన్నీ పెన్ డ్రైవ్‌లో ఇస్తే తాతయ్య "చిల్''
- అర్జున్ రెడ్డికి కొత్త చిక్కు... నాగరాజు నోటీసులు.. వెంకీతో విజయ్ దేవరకొండ సినిమా?
- 'తాతయ్యా చిల్'... కేటీఆర్ బంధువైతే రాజమౌళి నా తండ్రి, సమంత నా మరదలు : విజయ్ దేవరకొండ ట్వీట్
'పైసా వసూల్'కు నెగెటివ్ టాక్.. 'అర్జున్ రెడ్డి' మరింత దూకుడు
గత నెల 25వ తేదీన విడుదలైన 'అర్జున్ రెడ్డి' మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలెక్షన్లలో దూసుకుపోతోంది. విడుదలై వారం కూడా కాకముందే ఈ సినిమా కొత్త రికార్డులను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకు
గత నెల 25వ తేదీన విడుదలైన 'అర్జున్ రెడ్డి' మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలెక్షన్లలో దూసుకుపోతోంది. విడుదలై వారం కూడా కాకముందే ఈ సినిమా కొత్త రికార్డులను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అమెరికాలో కేవలం 89 థియేటర్స్‌లో మాత్రమే విడుదలైన ఈ సినిమా, కేవలం 5 రోజుల్లోనే 11 లక్షల ఒక వేయి 167 డాలర్లను వసూలు చేసింది.
ఇంత తక్కువ థియేటర్స్‌లో విడుదలై .. ఇంత తక్కువ సమయంలో ఒక మిలియన్ డాలర్లను వసూలు చేసి ఆశ్చర్యచకితులను చేసింది. ఇంతకుముందు అక్కడ రిలీజైన ఏ తెలుగు సినిమా ఈ అరుదైన ఫీట్‌ను సాధించలేకపోవడం విశేషం. 'పెళ్లి చూపులు' మాదిరిగానే 'అర్జున్ రెడ్డి' కూడా అక్కడ ఎక్కువ రోజులు ఆడేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ఈ చిత్రంలోని ముద్దు సన్నివేశాల వివాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ఏ సినిమా అయినా బాగుంటే కాంట్రావర్సీస్ ఎంత చేసినా ఎవరూ పట్టించుకోరని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ప్రేమ యొక్క స్వచ్ఛమైన రూపం ‘కిస్’ అని, కాంట్రావర్సీ సినిమా తాము తీయలేదని, ఈ సినిమాపై కొందరు కాంట్రావర్సీ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమాలో హిపోక్రసీ లేదని, ఇలాంటి ప్రేమకథలు చాలా ఉంటాయని, అందుకే, ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చిందని, బాగా ఆదరిస్తున్నారని చెప్పాడు.
