రేటు ఎంతైనా ఫర్వాలేదు.. టిక్కెట్ ఉందా... 'బాహుబలి' టిక్కెట్ల దందా... ఆన్‌లైన్‌లో కాంబో ఆఫర్
గత యేడాదిన్నరకాలంగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం "బాహుబలి 2 ది కంక్లూజన్". ఈ చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తొలి రోజునే వీక్షించాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఇదే
గత యేడాదిన్నరకాలంగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం "బాహుబలి 2 ది కంక్లూజన్". ఈ చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తొలి రోజునే వీక్షించాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఇదే అదనుగా భావించిన థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్ ధరలను ఆమాంతం పెంచేశాయి.
ఫలితంగా టికెట్ ఎంత రేటైనా ఫర్వాలేదు సినిమాను మొదటి రెండు మూడు రోజుల్లో చూడాలని సినీ జనం భావిస్తున్నారు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా రెచ్చిపోతున్నాయి. అందినకాడికి దండుకోవాలని చూస్తున్నాయి. సాధారణంగా రూ.120 రూపాయలు, రూ.150 ఉండే టికెట్ ధరను రూ.400, రూ.500, రూ.1000 వరకు కొన్ని థియేటర్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్‌తో పాటు ఈ సినిమా చూడాలనుకున్న సగటు సినీ ప్రేక్షకుడు తీవ్ర నిరాశ చెందుతున్నాడు.
దీనికి ప్రధాన కారణం... బాహుబలి చిత్రంతో పాటు.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటూ ప్రేక్షకుల్లో ఉన్న ఈ అంచనాలను సొమ్ము చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని థియేటర్ల యాజమాన్యాలు సరికొత్త దందాకు తెరలేపాయి. టికెట్ రేటును అమాంతం పెంచేశాయి. సినిమాను రిలీజైన కొత్తలోనే చూడాలని చాలామంది భావిస్తుంటారు.