బాహుబలి ప్రభాస్‌కి మోడీ బంపర్ ఆఫర్... ఏంటది..?
బాహుబలి. ఈ పేరు చెప్పగానే చిన్న పిల్లాడు కూడా ప్రభాస్ అని ఠక్కున చెప్పేస్తాడు. బాహుబలి సినిమా అలాంటిది. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి ప్రపంచ సినిమా చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది. మొదటి బాహుబల
బాహుబలి. ఈ పేరు చెప్పగానే చిన్న పిల్లాడు కూడా ప్రభాస్ అని ఠక్కున చెప్పేస్తాడు. బాహుబలి సినిమా అలాంటిది. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి ప్రపంచ సినిమా చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది. మొదటి బాహుబలి రికార్డు సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా ఆ సినిమాను తిలకించారు. సినిమాను చూసిన తర్వాత ప్రభాస్‌ను ఢిల్లీకి పిలిపించారు ప్రధాని. ఇప్పటికే బీజేపీలో కొనసాగుతున్న కృష్ణంరాజు... ప్రబాస్‌ను మోడీ పిలవగానే వెంటనే తీసుకెళ్ళి పోయాడు. అయితే కేవలం సినిమాల గురించి మాత్రమే అప్పట్లో మాత్రమే మాట్లాడిన మోడీ బాహుబలి-2 రిలీజ్ తర్వాత ప్రభాస్‌ను తమ పార్టీవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు ప్రభాస్. దర్శకుడు రాజమౌళి నటించిన సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రభాస్‌కు అలా పేరు రాగానే ఇక దాన్ని పూర్తిగా వాడుకునే ప్రయత్నం చేశాయి కొన్ని పార్టీలు. అందులో ముందుగా బీజేపీ పార్టీయే ఉంది. కృష్ణంరాజు బీజేపీ పార్టీలో కొనసాగుతుండటంతో ప్రభాస్‌ను బీజేపీ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చుకోవడం చాలా ఈజీ అయ్యింది. దీంతో గత రెండు రోజుల ముందు స్వయంగా కృష్ణంరాజుకు మోడీ స్వయంగా ఫోన్ చేసి ప్రభాస్‌ను బిజెపికి అంబాసిడగా పెట్టుకుందామని ప్రతిపాదించారట.
ప్రధానే స్వయంగా ఫోన్ చేయడంతో ఎగిరి గంతేసేంత పనిచేసిన కృష్ణంరాజు... ప్రభాస్‌ను నేను ఒప్పిస్తానంటూ హామీ ఇచ్చారట. ఈ విషయాన్నే ప్రభాస్‌కు చెప్పారట కృష్ణంరాజు. తండ్రితో సమానమైన కృష్ణంరాజు చెబితే ప్రభాస్ కాదంటారా? సరేనంటూ తలూపారట ప్రభాస్. మరి ఎప్పుడు ప్రభాస్ బీజేపీ పార్టీ తరపున ప్రచారం చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.