రజినీకాంత్ రికార్డును చెరిపేసిన బాలకృష్ణ..
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరిట ఉన్న రికార్డును యువరత్న నందమూరి బాలకృష్ణ చెరిపేశారు. ఈయన నటించిన చిత్రం ''లెజెండ్''. ఈ చిత్రం కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో 950 రోజులను పూర్తి చేసుకొన
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరిట ఉన్న రికార్డును యువరత్న నందమూరి బాలకృష్ణ చెరిపేశారు. ఈయన నటించిన చిత్రం ''లెజెండ్''. ఈ చిత్రం కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో 950 రోజులను పూర్తి చేసుకొని, వెయ్యి రోజులవైపు పయనిస్తోంది.
దక్షిణ భారతంలో ఇప్పటివరకూ ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా రజినీకాంత్ 'చంద్రముఖి' పేరిట ఉన్న రికార్డు (891 రోజులు)ను దాటి 'లెజెండ్' సరికొత్త రికార్డును సృష్టించిందని వారు తెలిపారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, అర్చన థియేటర్ యజమాని కె.ఓబుల్‌రెడ్డి సంయుక్తంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు.