బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 16 జులై 2017 (17:12 IST)

హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం : ఉప్పందించిన భరత్ మొబైల్ కాల్‌లిస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా వెలుగుచూడటానికి ప్రధాన కారణం ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భర్త మొబైల్ కాల్‌‌లిస్ట్ అని తేలింది. భరత్ కాల్ డేటాను నిశితంగా పరిశీలిస్తే అం

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా వెలుగుచూడటానికి ప్రధాన కారణం ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భర్త మొబైల్ కాల్‌‌లిస్ట్ అని తేలింది. భరత్ కాల్ డేటాను నిశితంగా పరిశీలిస్తే అందులో అనేక మంది సెలెబ్రిటీల పేర్లు ఉన్నట్టు తేటతెల్లమైంది. దీంతో పోలీసులు కూపీ లాగితే డొంకంకా కదిలింది. 
 
నిజానికి తెలుగు చిత్రపరిశ్రమను డ్రగ్స్ భూతం నీడలా వెంటాడుతోంది. గత కొద్దిరోజులుగా ఈ కేసులో పలువురి సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తూ వస్తోంది. సినిమాల్లో సందేశాలిచ్చే కొందరు సెలబ్రెటీలు నిజ జీవితంలో మాత్రం నీతులున్నది చెప్పడానికే.. వాటికి మేం అతీతం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. దీనికి తాజాగా వెలుగు చూసిన ఈ డ్రగ్స్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. 
 
అయితే టాలీవుడ్‌‌‌లో కొందరు సెలబ్రెటీలు డ్రగ్స్ ఎప్పటి నుంచో వాడుతున్నారు. అయినా ఇన్నాళ్లు చీకట్లో దాగిన ఈ నిజం ఇప్పుడే ఎందుకు వెలుగులోకొచ్చింది? ఇన్నాళ్లూ గుట్టు చప్పుడు కాకుండా నడిచిన ఈ దందా తాలూకు నిందితుల గురించి అసలు ఎలా తెలిసింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇదే సమాధానమంటూ ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
 
సినీనటుడు రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు అతని ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ ఫోన్‌లో ఉన్న డేటా టాలీవుడ్‌కు డ్రగ్స్ సరఫరా చేసే కొందరిని గుర్తించడానికి ఉపయోగపడిందని... అక్కడ తీగ లాగితే ఈ డొంకంతా కదిలిందని కొందరు చర్చించుకుంటున్నారు. 
 
రవితేజ తమ్ముడు భరత్‌ గతంలో కూడా డ్రగ్స్ ముఠాతో పట్టుబడిన సంగతి తెలిసిందే. భరత్ అన్నయ్య రవితేజ పేరు కూడా ఈ డ్రగ్స్ కేసులో వినిపించడంతో భరత్ కాల్‌లిస్ట్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భరత్ బ్రతికుంటే ఈ నోటీసులందుకున్న వారిలో అతను కూడా ఒకడయ్యేవాడని సినీ జనం మాట్లాడుకుంటున్నారు.