శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:26 IST)

సుబ్బిరామిరెడ్డి చిత్రంలో చిరు-పవర్ స్టార్, చిరుతో అనుష్క-పవన్‌తో శ్రుతి, డైరెక్టర్ ఎవరంటే?

టి.సుబ్బిరామిరెడ్డి తను చిరంజీవి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో చిత్రాన్ని నిర్మిస్తానని ఖైదీ నెం.150 ప్రి-రిలీజ్ ఫంక్షన్ సమయంలో చెప్పారు. దాన్ని నిజం చేస్తూ ఇవాళ అధికారిక ప్రకటన చేశారు. ఇద్దరు హీరోలను సంప్రదించి ఒప్పించిన తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ వద్ద

టి.సుబ్బిరామిరెడ్డి తను చిరంజీవి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో చిత్రాన్ని నిర్మిస్తానని ఖైదీ నెం.150 ప్రి-రిలీజ్ ఫంక్షన్ సమయంలో చెప్పారు. దాన్ని నిజం చేస్తూ ఇవాళ అధికారిక ప్రకటన చేశారు. ఇద్దరు హీరోలను సంప్రదించి ఒప్పించిన తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ వద్దకు రెండుమూడుసార్లు వెళ్లి చిత్రాన్ని ఖాయం చేసినట్లు సమాచారం. త్రివిక్రమ్ తో ఇప్పటికే కథపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. 
 
ఇక చిరంజీవి సరసన అందాల భామ అనుష్క నటించనున్నారనీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శ్రుతి హాసన్ నటిస్తుందని ఫిలిమ్ సర్కిళ్లలో జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. మరి టి. సుబ్బరామిరెడ్డి ఈ చిత్రాన్ని ఎప్పుడు పట్టాలు ఎక్కిస్తారో వెయిట్ అండ్ సీ.