శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2016 (11:37 IST)

మహేష్ బాబు సరసన పరిణీతి చోప్రా.. రెమ్యునరేషన్ రూ.3.5 కోట్లు

మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం 'బ్రహ్మోత్సవం'. అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో మహేష్ తన తర్వాతి సినిమాపై దృష్టి సారించాడు. తన తదుపరి చిత్రం తమిళ దర్

మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం 'బ్రహ్మోత్సవం'. అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో మహేష్ తన తర్వాతి సినిమాపై దృష్టి సారించాడు. తన తదుపరి చిత్రం తమిళ దర్శకుడు మురుగదాస్‌తో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాను ఏకకాలంలో మూడు భాషలలో రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. 
 
మహేష్ పక్కన నటించే హీరోయిన్ అంటూ ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. చివరికి బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతిని ఎంపికచేసుకున్నారు. బాలీవుడ్‌లో కొంచెం బొద్దుగా ముద్దుగా ఉండే హీరోయిన్ పరిణీతి చోప్రా. ఇది వరకే టాలీవుడ్ దర్శకులు ఆమెను తెలుగులో యాక్ట్ చేయించాలని చూశారు. కానీ ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ బాగా డిమాండ్ చేయడంతో టాలీవుడ్‌లోకి తీసుకు రాలేకపోయారు. ఇప్పుడా అవకాశం దర్శకుడు మురుగదాస్ ద్వారా కలిసొచ్చింది. 
 
'ఠాగూర్' మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆమె 3.5 కోట్ల రూపాయలు పారితోషికంగా అడిగిందట. దీంతో చేసేదిలేక భారీ మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నారట. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 100 కోట్ల భారీ నిర్మాణ వ్యవయంతో తెరకెక్కనున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ పక్కన పరిణీతి చోప్రా నటిస్తోందంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది.