బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 మే 2017 (17:52 IST)

కృష్ణవంశీ పాటలో రెజీనాకు 18 కాస్ట్యూమ్స్.. శివగామి రమ్యలా వుందట.. అందుకే?

టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం నక్షత్రం సినిమాతో బిజీ బిజీగా వున్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి తర్వాత కథానాయికలను అందంగా చూపించడంలో కృష్ణవంశీదే పైచేయి. రొమాంటిక్ పాటలను తెరకెక్కించడంలో కృ

టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం నక్షత్రం సినిమాతో బిజీ బిజీగా వున్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి తర్వాత కథానాయికలను అందంగా చూపించడంలో కృష్ణవంశీదే పైచేయి. రొమాంటిక్ పాటలను తెరకెక్కించడంలో కృష్ణవంశీదే అందెవేసినచేయి. తాజాగా కృష్ణ వంశీ న్యూ మూవీ 'నక్షత్రం'లో కూడా తన మార్క్ సాంగ్స్ వున్నాయని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
ముఖ్యంగా రెజీనాపై తీసిన సాంగ్ సినిమాకి హైలైట్  అవుతుందని సినీ యూనిట్ చెప్తోంది. ఈ చిత్రంలో జమునారాణిగా రెజీనా కనిపిస్తోంది. ఈ అమ్మడుపై తీసే సాంగ్ కోసం కృష్ణవంశీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలిసింది. రెజీనాని చూస్తే యంగ్ ఏజ్‌లో వున్న రమ్యకృష్ణలా కనిపించడంతో.. ఆమెను మరింత అందంగా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడట. ఈ పాటలో 18 కాస్ట్యూమ్స్‌లో రెజీనా కనిపిస్తుందట. కృష్ణ వంశీ ఫోకస్ చేసిన సాంగుతోనైనా  రెజీనామా మంచి ఆఫర్స్ వస్తాయో లేదో వేచి చూడాలి.