ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (13:47 IST)

ఆ హామీ ఇవ్వలేనన్న పవన్ కళ్యాణ్... జుట్టు పీక్కుంటున్న త్రివిక్రమ్...

త్రివిక్రమ్ శ్రీనివాస్. కొత్త కథతో తెలుగు ప్రేక్షకులను అలరించగల డైరెక్టర్. సినిమాలు పెద్దగా లేక ఇబ్బందులు పడుతున్న పవన్ కళ్యాణ్‌కు అత్తారింటికి దారేది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చే విధంగా చేశారు. అలా

త్రివిక్రమ్ శ్రీనివాస్. కొత్త కథతో తెలుగు ప్రేక్షకులను అలరించగల డైరెక్టర్. సినిమాలు పెద్దగా లేక ఇబ్బందులు పడుతున్న పవన్ కళ్యాణ్‌కు అత్తారింటికి దారేది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చే విధంగా చేశారు. అలాఇలా కాదు.. పవన్‌కు మంచి క్రేజ్ ఈ సినిమా ద్వారానే వచ్చింది. ఆ సినిమా భారీ విజయం తరువాత మరో కొత్త సినిమాకు ప్లాన్ చేసిన త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్‌‌తో కలిసి షూటింగ్ చేస్తున్నారు. కానీ చాలా ఆలస్యంగా జరుగుతోందని సమాచారం.
 
కారణం పవన్ కళ్యాణ్‌ రాజకీయాల వైపు ఎక్కువ దృష్టి పెట్టడం, ఎక్కువ సమయం దానికే కేటాయిస్తుండటంతో త్రివిక్రమ్ సినిమా చాలా ఆలస్యమవుతోంది. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ పుట్టిన రోజు. ఆ రోజుకు కనీసం 25 శాతం సినిమాను పూర్తి చేయాలనుకున్నారట త్రివిక్రమ్. కానీ పవన్ మాత్రం అటూఇటూ రాజకీయాల్లో బిజీబిజీగా తిరుగుతుండటంతో త్రివిక్రమ్ ఏం చెప్పాలో అర్థం కావడం లేదట. వీరిద్దరూ మంచి స్నేహితులు. అయితే సినిమా విషయంలో మాత్రం త్రివిక్రమ్ ఎక్కడా రాజీపడరు. సొంతవారైనా, ఎంత క్లోజయినా త్రివిక్రమ్‌కు అస్సలు ఇష్టముండదని సినీవర్గాలు చెబుతున్నాయి.
 
గత కొన్నిరోజులుగా పవన్‌ను షూటింగ్‌కు రమ్మని ఎంత పిలిచినా బిజీగా ఉన్నానని త్రివిక్రమ్‌కు ఫోన్‌లో చెప్పడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందట. ఇప్పటికి 5సార్లకు పైగా షూటింగ్‌ను పవన్ ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. దీంతో త్రివిక్రమ్, పవన్ పైన చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2 తరువాతైనా సినిమా కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించమని పవన్‌ను రిక్వెస్ట్ చేశారట త్రివిక్రమ్.
 
యూరప్‌లో షూటింగ్‌లో 10 రోజులు ఉండాల్సి వస్తుందని చెప్పారట త్రివిక్రమ్. అయితే అప్పుడు పరిస్థితిని బట్టి చెబుతాను తప్ప మాట ఇవ్వనని పవన్ ముఖం మీదే చెప్పేశారట. దీంతో త్రివిక్రమ్ సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.