శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (15:46 IST)

పోకిరి భామ ఇలియానా తల్లి కాబోతుందా..?

పోకిరి భామ ఇలియానా తల్లి కాబోతుందా..? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వివాహంపై ఇంకా క్లారిటీ ఇవ్వని ఇలియానా.. త్వరలోనే

పోకిరి భామ ఇలియానా తల్లి కాబోతుందా..? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వివాహంపై ఇంకా క్లారిటీ ఇవ్వని ఇలియానా.. త్వరలోనే తల్లి కాబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది.


ఇటీవల సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేసిన ఇలియానా హబ్బీ అని సంబోధించింది. దీంతో ఇలియానా ఆండ్రూతో సహజీవనం చేస్తుందని ఖరారైంది. ప్రస్తుతం ఇలియానా కడుపుతో వుందని బిటౌన్‌లో వార్తలొస్తున్నాయి. 
 
ఇటీవల జరిగిన ''రైడ్'' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఇలియానా, తాను గర్భం దాల్చిన విషయం తెలియకుండా వుండేందుకు తేలికపాటి దుస్తులు ధరించిందట. తాజాగా ఆండ్రూ తన ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో తన భార్య ఫొటోను షేర్‌ చేశాడు. 
 
ఆ ఫొటోలో ఇలియానా బాత్‌ టబ్‌‌లో కాఫీ తాగుతూ సేదదీరుతోంది. ఆ ఫోటోకు ఆండ్రూ, ''ఇలియానా ఏకాంతంగా మధురమైన సమయాన్ని గడుపుతున్నారు'' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె గర్భం దాల్చినట్లు నెటిజన్లు చర్చ మొదలెట్టారు. అయితే ఈ వార్తలపై ఇలియానా ఇంకా నోరు విప్పలేదు.