1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. JD Chakravarthy talks about casting couch for tollywood heroines

ఆ బడా ముసలి నిర్మాతపై కంపు.. ఆ హీరోయిన్ మమ్మల్ని మంచం కింద దాక్కోమంది.. జేడీ చక్రవర్తి

JD Chakravarthy
JD Chakravarthy
సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అకృత్యాలు ఎక్కువే. వీటిలో చాలామటుకు బయటపడవు. తమకు జరిగిన అన్యాయాలను బయటికి చెప్పడానికి చాలామంది మహిళలు సంకోచిస్తారు. అయితే కొందరు క్యాస్టింగ్ కౌచ్, మీటూ ద్వారా సినీ పెద్దలచే తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఓపెన్‌గా చెప్పారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్‌కు జరిగిన చేదు ఘటన గురించి నటుడు జేడీ చక్రవర్తి ఓపెన్ చేశారు. 
 
ఈ విషయం జరిగే సమయంలో తాను విలన్ రోల్స్ చేస్తుండే వాడినని, సుమన్ తనకు మంచి స్నేహితుడని జేడీ చెప్పుకొచ్చారు. అలాగే ఓ హీరోయిన్‌తో సుమన్ తాను డిన్నర్ చేస్తుండగా.. కాలింగ్ బెల్ మోగింది. ఎవరని చూసిన ఆ హీరోయిన్.. మమ్మల్ని మంచం కింద దాక్కోమని చెప్పింది. తమకు ఏమీ అర్థం కాలేదు. అమ్మాయికి తాత వయసున్న ఓ బడా ప్రొడ్యూసర్ వచ్చాడు. 
 
అతడు వెళ్లిపోయాక ఆ హీరోయిన్ నవ్వుతుంటే మా ఇద్దరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ ముసలోడిపై భరించలేని కంపు వస్తుంది. అయినా ఏం చేస్తాం.. తప్పదు కదా.. పెద్ద ప్రొడ్యూసర్ అంటూ చెప్పుకొచ్చిందని జేడీ అన్నారు. ఓ అమ్మాయి కూడా ఎవరితోనైనా ఏదైనా చేసిందంటే.. ఇది ఇష్టపడి కాదు.. పరిస్థితులు అలా చేస్తాయి.. జేడీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
అవకాశాల కోసం అమ్మాయిలు సినీ ఇండస్ట్రీలో నరకం అనుభవిస్తున్నారని జేడీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జేడీ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ బడా నిర్మాత ఎవరు?, ఆ హీరోయిన్ ఎవరు అనేదానిపై రచ్చ రచ్చ జరుగుతుంది. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Tamannaah: తమన్నాతో బ్రేకప్.. ఆలియా ఖురేషితో విజయ్ వర్మ లవ్వాయణం