"జై లవకుశ" మూలకథ లీక్.. కారణం ఎవరు...!
సామాజిక మాధ్యమాలను వాడుకుని తప్పుడు సందేశాలను పంపే వారి సంఖ్య ఎక్కువవుతోంది. చాలామందికి సామాజిక మాధ్యమాలు ఉపయోగపడుతుంటే, మరికొంతమంది మాత్రం వాటిని మిస్‌యూజ్ చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాలను వాడుకుని తప్పుడు సందేశాలను పంపే వారి సంఖ్య ఎక్కువవుతోంది. చాలామందికి సామాజిక మాధ్యమాలు ఉపయోగపడుతుంటే, మరికొంతమంది మాత్రం వాటిని మిస్‌యూజ్ చేస్తున్నారు. ప్రధానంగా వాట్సాప్, ఫేస్‌బుక్, కొన్ని వెబ్ సైట్లనే కొంతమంది ఆకతాయిలు ఎంచుకుంటున్నారు. అలాంటి ఆకతాయి పనినే కొంతమంది యువకులు చేశారు. అది కూడా ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న "జై లవకుశ"కు సంబంధించిన మొత్తం కంటెంట్‌ను ఫేస్‌బుక్‌లో పెట్టేశారు. కంటెంట్ లక్షల మంది అభిమానులు చూసేశారు.
సినిమా షూటింగ్ జరుగుతుండగానే కంటెంట్ బయటకు రావడంతో నిర్మాత కళ్యాణ్ రామ్ హైదరాబాద్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో ఎవరైతే కంటెంట్ దొంగించాలరో వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సినిమా కథ అత్యంత గోప్యంగా ఉంటే ఎవరు దీన్ని దొంగిలించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు కళ్యాణ్‌రామ్‌కు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కంటెంట్ బయటకు లీక్ కావడంతో ఏం చేయాలో అర్థం కాక సినీ యూనిట్ మొత్తం కూడా ఆలోచనలో పడిపోయింది.