నాకు అది అవసరం లేదంటున్న కాజల్ అగర్వాల్

Kajal Agarwal
కాజల్ అగర్వాల్
జె| Last Modified మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (13:53 IST)
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌లో బిజీబిజీగా ఉంటోంది. భారతీయుడు-2 సినిమాలో అద్భుత అవకాశాన్ని దక్కించుకున్న కాజల్ అగర్వాల్ ఈమధ్య వేదాంత ధోరణిలో మాట్లాడుతోందట. అందరు హీరోయిన్లలా తనకు మేకప్ అవసరం లేదనీ, తనది సహజమైన అందమనీ, తనకు ఎలాంటి మేకప్ లేకున్నా అందంగానే కనిపిస్తానని చెబుతోందట కాజల్.

అయితే సినిమా షూటింగ్‌లో మాత్రం తెల్లగా ఎందుకు మేకప్ వేసుకుంటావని ప్రశ్నిస్తే మరింత అందంగా కనిపించడానికే ఆ ప్రయత్నమంతా. అయితే నేను మేకప్ వేయాలని ఎవరిని కోరను. నన్ను అందంగా చూపించడానికి డైరెక్టర్ తాపత్రయ పడుతుంటాడు. అందుకే మేకప్ వేస్తారు.

నా అందం ఏంటో నాకు తెలుసు. మేకప్ లేకున్నా నేను ఎంత అందంగా ఉంటానో నాకు మాత్రమే కాదు.. మిగిలిన నటీమణులకు తెలుసునంటోంది కాజల్. సహజనటిగా ఫిదా హీరోయిన్ సాయిపల్లవి ఎలాంటి మేకప్ లేకుండా సినిమాల్లో నటిస్తూ మంచి పేరే తెచ్చేసుకుంటోంది. అందం ముఖ్యం కాదు అభినయం ముఖ్యమని సాయిపల్లవి నిరూపించింది. అందుకే ఆమెను కాజల్ ఫాలో అవుతోందని స్నేహితులు మాట్లాడేసుకుంటున్నారట.దీనిపై మరింత చదవండి :