సంబంధిత వార్తలు
- కళ్యాణ్ రామ్ కొత్తదనం చూపించాలని ట్రై చేస్తుంటాడు కానీ...?
- జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న నందమూరి హీరో
- కాజల్ అగర్వాల్‌కి షాక్ ఇచ్చిన జర్నలిస్టులు (వీడియో)
- బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఏమిటి నీ ధైర్యం..? రోబో 2.0తోనే పెట్టుకుంటావా?
- ఎవరిష్టం వారిది.. వస్తే రావొచ్చు.. రాకపోతే పోవచ్చు.. బాలయ్య
కళ్యాణ్ రామ్ తెలివైన నిర్ణయం...
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం కవచం. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కించారు. పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ స్టోరీ అయిన కవచం సినిమాపై బెల్లంకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కాజల్ అగర్వాల్, మెహ్రీన్, చోటా కే నాయుడు... ఇలా భారీ తారాగణం, సాంకేతిక నిపుణలతో రూపొందిన కవచం సినిమా ఖచ్చితంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి విజయాన్ని అందిస్తుంది అనుకున్నారు కానీ.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ సినిమా డిజాస్టర్ టాక్ దక్కించుకుంది.
అసలు విషయం ఏంటంటే... ఈ సినిమా కథ ముందుగా కళ్యాణ్ రామ్ దగ్గరకి వెళ్లిందట. అయితే.. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాలో పోలీసాఫీసర్‌గా చేసుండటం వలన అనుకుంటా నో చెప్పేసాడట. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరకి వెళితే ఇప్పటివరకు పోలీసాఫీసర్‌గా చేయకపోవడంతో అనుకుంటా వెంటనే ఓకే చెప్పాడట. ఒక రకంగా కళ్యాణ్ రామ్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్లాప్ మూవీ నుంచి తప్పించుకున్నాడు.
తర్వాతి కథనం
