కాజల్ అగర్వాల్‌కి షాక్ ఇచ్చిన జర్నలిస్టులు (వీడియో)
కవచం సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కాజల్ నటించింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కాజల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసారు చిత్ర యూనిట్. అయితే... చెప్పిన టైమ్ కంటే 2 గంటలు ఆలస్యంగా వచ్చిందట కాజల్. అప్పటివరకు ఎదురుచూసిన జర్నలిస్టులకు సిటీలో ఉండి కూడా రావడానికి ఇంత లేటా అని ప్రెస్ మీట్ బాయ్ కట్ చేసి వెళ్లిపోయాటర. అంతే... కాజల్ షాక్ అయ్యిందట.
రీసెంట్‌గా తమన్నా కూడా జర్నలిస్టులను బాగా వెయిట్ చేయించింది. ఇప్పుడు కాజల్ కూడా వెయిట్ చేయించడంతో చిర్రెత్తుకొచ్చి ప్రెస్ మీట్ బాయ్‌కాట్ చేసారట. తెలుగు మీడియా అంటే ఈ హీరోయిన్లకు కాస్త చిన్నచూపు. ఎంత ఆలస్యంగా వెళ్లినా ఏమీ అనరులే. వాళ్లే వెయిట్ చేస్తారని. ఊహించని ఈ సంఘటనతో షాకైన కాజల్ ఇక నుంచైనా కరెక్ట్ టైమ్‌కి వస్తుందేమో చూడాలి. ఇకపోతే కవచం చిత్రం గురించి కాజల్ అగర్వాల్ ఏం చెప్పిందో చూడండి.