మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 4 డిశెంబరు 2018 (17:39 IST)

కాజల్ అగర్వాల్ లవ్‌లో పడిందా? ఎవరితో?

కాజల్ అగర్వాల్ ఓ యువనటుడితో లవ్‌లో పడిందంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. సినీ పరిశ్రమలో గుసగుసలు మామూలే. ఐతే ఆ యువ నటుడు ఎవరో కాజల్ అగర్వాల్ ఎక్కడకెళితే అక్కడకెళుతున్నాడట. టాప్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ ఓ యువ హీరోతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందట. 
 
కాజల్‌కు సినీపరిశ్రమలో ఎంతోమంది యువ నటులు తెలుసు. ఎంతోమంది సీనియర్ నటులతో కూడా నటించింది. ఆమె నటించిన కొన్ని సినిమాలకు సంబంధించిన హీరోలకు పెళ్ళిళ్ళు కూడా కాలేదు. వారందరినీ వదిలిపెట్టి అతడితో కాజల్ ప్రేమాయణం నడపుతోందట. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదంటున్నారు సినీప్రముఖులు. 
 
ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చని, వారిద్దరి అభిప్రాయాలు కలవడం వల్లనే ప్రేమ చిగురించి ఉంటుందంటున్నారు. ఇదిలావుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కాజల్ అగర్వాల్ కవచం సినిమాలో కలిసి నటించింది. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన విడుదల కానుంది.