కళ్యాణ్ రామ్ కొత్తదనం చూపించాలని ట్రై చేస్తుంటాడు కానీ...?
నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా తర్వాత సినిమాలు చేసినా విజయం మాత్రం వరించలేదు. కొత్తదనం చూపించాలని ట్రై చేస్తుంటాడు కానీ.. ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. తాజాగా కళ్యాణ్ రామ్ కేవీ గుహన్ దర్శకత్వంలో 118 అనే సస్పెన్స్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత యువ దర్శకుడుతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకీ ఆ యువ దర్శకుడు ఎవరంటారా..? విరించి వర్మ.
ఉయ్యాలా జంపాలా, మజ్ను చిత్రాలతో ఆకట్టుకున్న విరంచి వర్మ కళ్యాణ్ రామ్‌కి ఈమధ్యే ఒక ఇంట్రెస్టింగ్ స్టొరీ.. డిఫరెంట్ హీరో క్యారెక్టరైజేషన్‌తో స్టోరీ చెప్పడం... వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. మరి... సరైన సక్సస్ కోసం ఎదురుచూస్తోన్న కళ్యాణ్ రామ్‌ని విరంచి వర్మ కొత్తగా ఎలా చూపించనున్నాడో చూడాలి.