గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (17:09 IST)

నేను సెక్సువల్లీ ఎట్రాక్టివ్... అలా వాడేసుకున్నారు... లిస్టు వుంది... కంగనా సంచలనం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్‌గా మంచి పేరున్న ఈమె ఎలాంటి గ్లామర్ రోల్స్ పోషించేందుకైనా వెనుకాడదు. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఈమె సొంతం. 'తను వెడ్స్ మను', 'క్వీన్' లాంటి సినిమాలు కంగనా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్‌గా మంచి పేరున్న ఈమె ఎలాంటి గ్లామర్ రోల్స్ పోషించేందుకైనా వెనుకాడదు. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఈమె సొంతం. 'తను వెడ్స్ మను', 'క్వీన్' లాంటి సినిమాలు కంగనా రేంజ్‌ని ఎక్కడికో తీసుకెళ్ళాయి.
 
ఉంగరాల జుత్తుతో గమ్మత్తుగా కనిపించే కంగనా ప్రస్తుతం రాణి లక్ష్మీభాయ్ అనే చారిత్రాత్మక సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా కోసం యుద్ధం, గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది.
 
సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా అన్నింటికీ సిద్ధపడి రావాలని చెప్పింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఉండదు కాని, కేవలం స్వయంకృషినే నమ్ముకుని సినిమా రంగంలో అడుగుపెడితే మాత్రం బాధలు తప్పవని చెప్తోంది. హీరోయిన్‌గా ఛాన్సిచ్చేందుకు ముందు వాడుకోవాలని చూస్తారని వెల్లడించింది. 
 
తాను కూడా అలాంటి భాదితురాలినేనని, అలాంటి అనుభవాల వల్లే రాటు తేలానని ఓపెన్‌గా చెప్పేసింది కంగనా రనౌత్. ఫ్యాషన్ మూవీలో తాను చేసిన పాత్రకు నిజజీవితంలో తాను అనుభవించిన ఇబ్బందులకు పోలికలు ఉన్నాయని అప్పట్లోనే కామెంట్స్ చేసిన కంగనా రనౌత్.. హీరోయిన్లు కావాలనుకున్న అమ్మాయిలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. బాలీవుడ్‌లోనే మాత్రమే కాదు.. ఎక్కడైనా ఇదే పరిస్థితి అంటూ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేసింది. 
 
ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రారంభంలో తనను చాలామంది వాడుకున్నారనీ, తననే కాదు తనకు తెలిసిన కొందరు హీరోయిన్లను కూడా అలా వాడేసుకున్నారంటూ చెప్పేసింది. ఈ మాటలతో ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు భుజాలు తడుముకుంటున్నారు. కానీ కంగనా చెప్పాల్సింది చెప్పేసిందంతే.