శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (19:23 IST)

గోల్డ్ కాయిన్ సుందరిగా మారిపోయిన కీర్తి సురేష్‌.. ఎలా?

కీర్తి సురేష్‌‌ను మా మంచి బంగారమంటూ తెలుగు సినీ పరిశ్రమలోని వారు తెగ పొగిడేస్తున్నారట. ముఖ్యంగా సినిమాల్లో పనిచేసే వర్కర్స్, యూనిట్ సభ్యులు కీర్తి సురేష్‌ నటించే సినిమాల్లో పనిచేసేందుకు పోటీ పడుతున్నారట. కీర్తి సురేష్‌‌ను అందరూ ఇప్పుడు గోల్డ్ కాయిన్

కీర్తి సురేష్‌‌ను మా మంచి బంగారమంటూ తెలుగు సినీ పరిశ్రమలోని వారు తెగ పొగిడేస్తున్నారట. ముఖ్యంగా సినిమాల్లో పనిచేసే వర్కర్స్, యూనిట్ సభ్యులు కీర్తి సురేష్‌ నటించే సినిమాల్లో పనిచేసేందుకు పోటీ పడుతున్నారట. కీర్తి సురేష్‌‌ను అందరూ ఇప్పుడు గోల్డ్ కాయిన్ సుందరి అని పిలుస్తున్నారట. 
 
టాలీవుడ్‌లోను, కోలీవుడ్‌లోను ఇప్పుడు కీర్తి సురేష్‌‌కు ఇదే పేరు. కీర్తి సురేష్‌ తను ఏ సినిమాలో పనిచేసినా ఆ సినిమా యూనిట్లో పనిచేసే వారికి ఒక గ్రాము బంగారం కాయిన్ ఇవ్వడం అలవాటుగా చేసుకుందట. మహానటి సినిమా పూర్తయిన తరువాత 200 మంది సినిమా యూనిట్‌లోని సభ్యులకు గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇచ్చిందట కీర్తి సురేష్‌.
 
అలాగే తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న పందెం కోడి-2 సినిమా యూనిట్ సభ్యులకు బంగారం కాయిన్స్ ఇచ్చిందట. తన ప్రతి సినిమాలోను ఇలా కాయిన్స్ ఇస్తూనే ఉంటానని చెబుతోందట కీర్తి సురేష్‌. అంతేకాదు సినిమా పూర్తయిన తరువాత సినిమా యూనిట్ సభ్యులందరికీ మంచి ట్రీట్ కూడా ఇస్తోందట. అందుకే కీర్తి సురేష్‌ సినిమాలో పనిచేసేందుకు పోటీలు పడుతున్నారట యూనిట్ సభ్యులు.