సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (14:38 IST)

మెగా ఈవెంట్‌ 'ఖైదీ థ్యాంక్స్ మీట్' వేదిక ఖరారు

మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ అదిరిపోయింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ 'ఖైదీ నెం.150' ఇండస్ట్రీ రికార్దులని బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే నాన్ 'బాహుబలి' రికార్డులన్నీ బద్దలయ్యాయ

మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ అదిరిపోయింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ 'ఖైదీ నెం.150' ఇండస్ట్రీ రికార్దులని బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే నాన్ 'బాహుబలి' రికార్డులన్నీ బద్దలయ్యాయి. మన్ముందు 'బాహుబలి' రికార్డులు కూడా బద్దలయ్యే అవకాశం ఉంది. దీంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
దశాబ్దకాలం తర్వాత వెండితెరపై కనిపించినప్పటికీ.. ఇంతటీ ఘనవిజయాన్ని అందించిన అభిమానులకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పేందుకు థ్యాక్స్ మీట్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, థ్యాంక్స్ మీట్‌ని ఎక్కడ నిర్వహించాలనే అంశంపై మెగా ఫ్యామిలీ కొద్దిరోజులుగా తర్జనభర్జన పడుతోంది. 
 
వైజాగ్ లేదా హైదరాబాద్‌లో మెగా థ్యాక్స్ మీట్ ఉండనుందని ఇప్పటికే నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. చివరికి మెగా ఫ్యామిలీ హైదరాబాద్‌వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. జనవరి 28న హైదరాబాద్ వేదికగా భారీ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. అయితే, ఇప్పటి వరకు థ్యాక్స్ మీట్‌పై మెగా ఫ్యామిలీ అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ మెగా థ్యాంక్స్ మీట్ నిర్వహణపై సందేహం నెలకొనివుంది.